కొడుకు మరణం తట్టుకోలేని ఓ తల్లి.. | komuraiah and his mother died | Sakshi
Sakshi News home page

కొడుకు మరణం తట్టుకోలేని ఓ తల్లి..

Aug 23 2015 12:10 AM | Updated on Sep 3 2017 7:56 AM

కొడుకు మరణించాడన్న నిజాన్ని తట్టుకోలేని ఓ తల్లి వెంటనే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి పరిధిలోని నర్సింగాపూర్‌లో శనివారం జరిగింది.

తిమ్మాపూర్ (కరీంనగర్ జిల్లా): కొడుకు మరణించాడన్న నిజాన్ని తట్టుకోలేని ఓ తల్లి వెంటనే మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి పరిధిలోని నర్సింగాపూర్‌లో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన అల్లెపు లింగయ్య, మల్లవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో కొమురయ్య(50) శనివారం పనికి వెళ్లి వచ్చాడు. నీళ్లివ్వాలని అడిగి.. వెంటనే నోటిలో నుంచి నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయాడు.

ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే.. తల్లి మల్లవ్వ కొడుకు మీద పడి ఏడుస్తూ స్పృహ కోల్పోయింది. ఆటోలో కొమురయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో దుద్దెనపల్లి వద్ద 108లోకి ఎక్కించేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే తల్లి మల్లవ్వ సైతం మృతి చెందడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement