కొడుకు ఆత్మహత్య.. గుండెపోటుతో తల్లి మృతి | Tragedy in Jagtial District | Sakshi
Sakshi News home page

కొడుకు ఆత్మహత్య.. గుండెపోటుతో తల్లి మృతి

Mar 19 2026 2:00 AM | Updated on Mar 19 2026 2:00 AM

Tragedy in Jagtial District

జగిత్యాల జిల్లాలో విషాదం

జగిత్యాల క్రైం: ఒకే రోజు తల్లీకొడుకులు మృతిచెందిన సంఘటన జగిత్యాల అర్బన్‌ మండలం మోతె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మోతె గ్రామానికి చెందిన దొడ్ల రాములు, మల్లవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు. ఐదేళ్ల క్రితం రాములు అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటినుంచి మల్ల వ్వ ఇద్దరు కుమారులతో గ్రామంలోనే రైతుల భూ ములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. చిన్నకొడుకు సంపత్‌ జీవనోపాధి కోసం దుబాయ్‌ వెళ్లి వచ్చి ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాడు. 

పెద్ద కుమారుడు సంతోష్‌ ఉపాధి కోసం తుర్కియే వెళ్లాడు. మల్లవ్వ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణంతోపాటు వ్యవసాయ పెట్టుబడికి కొన్ని అప్పులయ్యా యి. అప్పు తీర్చడం కష్టంగా ఉందంటూ సంపత్‌ (25) నిత్యం మధనపడుతున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం సాయంత్రం పురుగుల మందుతాగా డు. బంధువులు అతడిని కరీంనగర్‌లోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చేరి్పంచగా బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. 

అతడి మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా.. పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో మల్లవ్వ (55)కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను అత్యవసర వార్డు కు తరలించిన వైద్యులు సీపీఆర్‌ చేసినా ఫలితం దక్కలేదు. ఒకేరోజు కొడుకు, తల్లి మృతిచెందడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సాయంత్రం ఇద్దరు మృతదేహాలను గ్రామంలో అద్దెకుంటున్న ఓ రేకులòÙడ్డుకు తరలించారు. సంతోష్‌ విదేశాల నుంచి వచ్చాక అంత్యక్రియలు చేయనున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement