ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి విమర్శించారు.
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. శనివారం విజయనగరంలో కోలగట్ల విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆయన విమర్శించారు.
జూన్ 8న అన్ని పోలీస్ స్టేషన్లలో తాము ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రెండేళ్లలో చంద్రబాబు, మంత్రులే అభివృద్ధి చెందారు తప్పా ప్రజలకు మేలు జరుగలేదని ఎమ్మెల్సీ కోలగట్ల అన్నారు.