కిటో టమాటా రూ.60 | kilo tomato rs.60 only | Sakshi
Sakshi News home page

కిటో టమాటా రూ.60

Jul 13 2017 10:43 PM | Updated on Jul 29 2019 5:44 PM

బహిరంగ మార్కెట్‌లో టమాటా ధరలు అమాంతం పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : బహిరంగ మార్కెట్‌లో టమాటా ధరలు అమాంతం పెరిగిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టమాటా కొనాలంటేనే ఠారెత్తిపోతున్నారు. అందువల్లే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతుబజార్‌లో కాస్త తక్కువ ధరకే పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు మార్కెటింగ్‌శాఖ ఏడీ బి.హిమశైల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి స్థానిక రైతుబజార్‌లో కిలో రూ.60 ప్రకారం టమాటా విక్రయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో టమాటా పండిస్తున్న రైతులతో మాట్లాడి ధరలు తగ్గుముఖం పట్టేదాకా రైతుబజార్‌లో టమాటా విక్రయాలు కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement