ఆయన హిట్లర్‌ను మరిపిస్తున్నారు | kcr like hitler: ravula | Sakshi
Sakshi News home page

ఆయన హిట్లర్‌ను మరిపిస్తున్నారు

Aug 18 2015 11:17 PM | Updated on Aug 15 2018 9:30 PM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హిట్లర్‌ను మరిపించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హిట్లర్‌ను మరిపించేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసును ఏసీబీ విచారిస్తోందా, లేదా టీఆర్‌ఎస్ విచారిస్తోందా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యే రేవంత్‌పై కేసును ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు.

ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్‌లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. ఏసీబీ కాకుండా ఈ కేసును మరో ప్రైవేటు సంస్థ విచారిస్తోందని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసులో ముద్దాయి కాదని, సాక్షి మాత్రమేనన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement