కన్నెపల్లిలో పంపు హౌజ్కు కేసీఆర్ భూమిపూజ | KCR lay foundation for Kaleshwaram in karimnagar district | Sakshi
Sakshi News home page

కన్నెపల్లిలో పంపు హౌజ్కు కేసీఆర్ భూమిపూజ

May 2 2016 8:09 AM | Updated on Oct 30 2018 7:50 PM

కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో కొలువై ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం దర్శించుకున్నారు.

మంథని: కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో కొలువై ఉన్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం దర్శించుకున్నారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన సీఎం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శుభానందదేవికి రూ.60 లక్షలతో రూపొందించిన బంగారు కిరీటాన్ని సమర్పించుకున్నారు.

అనంతరం ముఖ్యమంత్రి కన్నెపల్లి వద్ద పంప్‌హౌజ్ నిర్మాణానికి సతీసమేతంగా భూమి పూజ నిర్వహించారు. అల్పాహారం తర్వాత కేసీఆర్ మేడిగడ్డకు చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి వెంట స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement