రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయాలి | kanshiram cermony at kakinada | Sakshi
Sakshi News home page

రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయాలి

Oct 9 2016 11:16 PM | Updated on Sep 4 2017 4:48 PM

కాకినాడ సిటీ : కాన్షీరామ్‌ స్ఫూర్తితో రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సంపత్‌రావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ భవన్‌లో బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరామ్‌ 10వ వర్ధంతి సభను ఆదివారం నిర్వహించారు. తొలుత జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, కాన్షీరామ్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాన్షీరామ్‌ ఉత్తరప్రదేశ్‌లో రాజ్యాధి

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపత్‌రావు
కాకినాడ సిటీ : కాన్షీరామ్‌ స్ఫూర్తితో రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సంపత్‌రావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ భవన్‌లో బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరామ్‌ 10వ వర్ధంతి సభను ఆదివారం నిర్వహించారు. తొలుత జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, కాన్షీరామ్‌ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాన్షీరామ్‌ ఉత్తరప్రదేశ్‌లో రాజ్యాధికారాన్ని సాధించడంలో చేసిన కృషిని స్మరించుకుని, ఆయన సేవలను కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బర్రె కొండబాబు మాట్లాడుతూ పార్టీని జిల్లాలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు. త్వరలో కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని సూచించారు. 50 డివిజన్‌లలో అభర్థులను పోటీకి నిలుపుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్తుల లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బతి కృష్ణప్రసాద్, జిల్లా కార్యదర్శులు ఎం.వి.సుబ్బారావు, మేడిది చిట్టినాయన, జిల్లా ఉపాధ్యక్షుడు కె.నరసింహమూర్తి, కాకినాడ నగర అధ్యక్షుడు దాసరి వెంకట్, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్‌్జలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement