‘మరో రేవంత్‌, ఉత్తమ్‌లా కోదండరాం కావద్దు’ | Kadiam srihari slams Kodanda ram | Sakshi
Sakshi News home page

‘మరో రేవంత్‌, ఉత్తమ్‌లా కోదండరాం కావద్దు’

Jun 6 2016 5:46 PM | Updated on Sep 19 2019 8:44 PM

ప్రొఫెసర్ కోదండరాం మరో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కావద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

ఆదిలాబాద్: ప్రొఫెసర్ కోదండరాం మరో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కావద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం ఆదిలాబాద్‌లో స్పందించారు. పదవీ విరమణ చేసిన తర్వాత కోదండరాంకు మతి భ్రమించిందా లేక ఆలోచనలో మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరాం మాట్లాడడం వెనుక ఏదో శక్తి ఉందన్నారు. 
 
రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే, ప్రజలు ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతుంటే కోదండరామ్‌కు అవి కనిపించడం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. కోదండరామ్ వ్యాఖ్యల వెనుక అభివృద్ధి ఓర్వలేని శక్తులేవో ఉన్నాయని తమకు అనుమానంగా ఉందన్నారు. ప్రజలకు కోదండరామ్‌పై ఉన్న గౌరవాన్ని పలుచున చేసుకోరాదని కడియం శ్రీహరి హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement