కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక
వట్లూరు (పెదపాడు) : రాష్ట్రస్ధాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేసినట్టు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి మరడాని అచ్యుతరావు తెలిపారు.
వట్లూరు (పెదపాడు) : రాష్ట్రస్ధాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేసినట్టు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి మరడాని అచ్యుతరావు తెలిపారు. వట్లూరులో వారం రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ క్రీడాకారుల శిక్షణా కార్యక్రమం బుధవారంతో ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఈ నెల 6,7,8 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే జిల్లా స్త్రీ, పురుష కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని అచ్యుతరావు తెలిపారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులు, సామాగ్రి అందించారు. స్థానిక నాయకులు కొమ్మన లక్ష్మణ మోహన్, బసవయ్య, పీఈటీలు పీఎన్ మల్లేశ్వరరావు, ఎం.చిన రంగారావు, కొమ్మంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు.