శ్రీవారి సేవలో జస్టిస్‌ దల్‌వీర్‌ బండారి | justice dalveer bhandari in tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో జస్టిస్‌ దల్‌వీర్‌ బండారి

Aug 13 2016 6:34 PM | Updated on Sep 4 2017 9:08 AM

ఆలయం వద్ద  జస్టిస్‌ దల్‌వీర్‌ బండారి, పక్కన హరీంద్రనాథ్, శేషాద్రి

ఆలయం వద్ద జస్టిస్‌ దల్‌వీర్‌ బండారి, పక్కన హరీంద్రనాథ్, శేషాద్రి

ఇంటర్‌ నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ జడ్జ్‌ జస్టిస్‌ దల్‌వీర్‌ బండారి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు.

 
సాక్షి, తిరుమల: ఇంటర్‌ నేషనల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ జడ్జ్‌ జస్టిస్‌ దల్‌వీర్‌ బండారి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా,  డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ పట్టువస్త్రంతో సత్కరించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ప్రోటోకాల్‌ జడ్జి శేషాద్రి ఉన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement