వైఎస్సార్‌సీపీ బంద్‌కు సహకరించండి | join in byndh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ బంద్‌కు సహకరించండి

Aug 1 2016 12:18 AM | Updated on Mar 23 2019 9:10 PM

ఆత్మకూరురూరల్‌ : ఈనెల 2వ తేదీన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు నిర్వహించే బంద్‌కు అందరూ సహకరించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు.

 ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఆత్మకూరురూరల్‌ : ఈనెల 2వ తేదీన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు నిర్వహించే బంద్‌కు అందరూ సహకరించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. రాష్ట్ర విభజనను చాలా దారుణంగా చేశారని, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. టీడీపీ ప్రభుత్వం సైతం కేంద్రంపై ఒత్తిడి తేకపోవడంతో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ హోదా సాధించేందుకు ప్రజలతో కలిసిపోరాడుతోందన్నారు. బంద్‌కు విద్యార్థి సంఘాలు, వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ సిబ్బంది తదితరులందరూ సంపూర్ణంగా సహకరించి నిరసన గళాన్ని వినిపించాలని ఆయన కోరారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement