జిల్లా ఉపాధి కార్యాలయంలో వచ్చే నెల 2న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి (టెక్నికల్) సీహెచ్. సుబ్బిరెడ్డి తెలియజేశారు.
2న జాబ్‌మేళా
Jul 31 2016 12:14 AM | Updated on Jul 12 2019 4:29 PM
మర్రిపాలెం : జిల్లా ఉపాధి కార్యాలయంలో వచ్చే నెల 2న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి (టెక్నికల్) సీహెచ్. సుబ్బిరెడ్డి తెలియజేశారు. నగరంలోని రిలయెన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత, 30 ఏళ్లు నిండిన గహిణులు జాబ్‌మేళాకు అర్హులన్నారు. 15 ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రారంభ జీతం నెలకు రూ.12 వేలు. అలెవెన్సులు అదనం. నెలన్నర రోజులు శిక్షణ కాలంలో నెలకు రూ.12 వేలు కంపెనీ చెల్లిస్తుందని వివరించారు. ఆసక్తిగల గహిణులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాత ఐటీఐ జంక్షన్ ప్రాంతంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు నేరుగా హాజరుకావాలన్నారు.
Advertisement
Advertisement