10న డీఆర్‌డీఏ జాబ్‌మేళా | jobmela on 10th | Sakshi
Sakshi News home page

10న డీఆర్‌డీఏ జాబ్‌మేళా

Sep 7 2016 12:41 AM | Updated on Sep 4 2017 12:26 PM

డీఆర్‌డీఏ–వెలుగు ఆధ్వర్యంలో ట్రై నీ సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ ఉద్యోగాల భర్తీకోసం ఈ నెల 10వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(హాస్పిటల్‌): డీఆర్‌డీఏ–వెలుగు ఆధ్వర్యంలో ట్రై నీ సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ ఉద్యోగాల భర్తీకోసం ఈ నెల 10వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు రాయలసీమ యూనివర్సిటీలో ఎంపికలు జరుగుతాయి. వివిలెక్స్‌ టెక్నాలజీస్, బెంగళూరు వారు ఎస్‌ఎల్‌కే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తారు. బీఎస్సీ(మ్యాథ్స్‌), బీసీఏ, బీకాం అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్‌ ఆప్టిట్యూట్‌ టెస్ట్, హెచ్‌ఆర్, టెక్నికల్‌ రౌండ్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌ అంశాల్లో ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఉంటుంది. అభ్యర్థులు ఇంటర్‌నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ నుంచి http://goo.gl/forms/FJEROjflpz లో తమ జీమెయిల్‌ అకౌంట్‌ ద్వారా పూర్తి వివరాలు రిజిస్టర్‌ చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలపాటు సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌లో శిక్షణ ఇస్తారు. మూడేళ్ల కాలానికి గ్యారంటీ బాండ్‌ రాసివ్వాల్సి ఉంటుంది. వార్షిక వేతనం రూ.2.1 లక్షలుగా నిర్ణయించారు. వివరాలకు ఫోన్‌(08105005202, 076775926666)లో సంప్రదించవచ్చు. 
 

Advertisement
 
Advertisement
Advertisement