జాబ్‌మేళా సందర్శన | Job Mela | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళా సందర్శన

Oct 20 2016 11:54 PM | Updated on Sep 4 2017 5:48 PM

జాబ్‌మేళా సందర్శన

జాబ్‌మేళా సందర్శన

నోవా ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ గురువారం పరిశీలించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే బ్లాక్‌ను సందర్శించి ఆన్‌లైన్‌ విధానం, కౌన్సెలింగ్, అడ్మిట్‌ కార్డులు పొందే ప్రక్రియను వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు.

జూపూడి (ఇబ్రహీంపట్నం) :    నోవా ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ గురువారం పరిశీలించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేయించుకునే బ్లాక్‌ను సందర్శించి ఆన్‌లైన్‌ విధానం, కౌన్సెలింగ్, అడ్మిట్‌ కార్డులు పొందే ప్రక్రియను వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాకు విశేష స్పందన ఉందని చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట కాపు కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ చలమలశెట్టి రామానుజయ, కళాశాల డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్‌ శ్రీనాథ్‌ తదితరులు ఉన్నారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement