జయహో భారత్‌ | jayaho bharath | Sakshi
Sakshi News home page

జయహో భారత్‌

Jan 28 2017 10:39 PM | Updated on Sep 5 2017 2:21 AM

జయహో భారత్‌

జయహో భారత్‌

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష అభివృద్ధి సాధిస్తున్న మన దేశం వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఒకేసారి 103 స్వదేశీ, విదేశీ రాకెట్లను నింగిలోకి తీసుకెళ్లేందుకు మన శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతు పలుకుతూ

  • రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్ష
  • ఇస్రో శాస్త్రవేత్తలకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ప్రదర్శన 
  • పుష్కర్‌ఘాట్‌ వద్ద విద్యార్థుల సందడి
  • కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : 
    శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష అభివృద్ధి సాధిస్తున్న మన దేశం వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఒకేసారి 103 స్వదేశీ, విదేశీ రాకెట్లను నింగిలోకి తీసుకెళ్లేందుకు మన శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతు పలుకుతూ విద్యార్థులు జయహోభారత్‌ అంటూ ముక్తకంఠంతో నినదించారు. ఇస్రో ప్రయోగించనున్న 103 రాకెట్లు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జయహో అంటూ విద్యార్థుల నినాదాలతో రాజమహేంద్రవరంలోని పుష్కర్‌ఘాట్‌ మార్మోగింది. సారథి స్వచ్ఛంద సంస్థ, ఆదిత్య డిగ్రీ కళాశాల, ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సంయుక్తాధ్వర్యంలో శనివారం ఇస్రో నమూనా రాకెట్‌ ప్రదర్శన  నిర్వహించారు. విద్యార్థులంతా రాకెట్‌ నమూనాలో కూర్చుని అందర్నీ అలరించారు. 
    ముఖ్యఅతిథిగా రాజమహేంద్రవరం ఎంపీ ఎం.మురళీమోహ¯ŒS మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. ఇప్పటికే ఎన్నో ఘన విజయాలు సాధించిన ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగంలోనూ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేయర్‌ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ విద్యార్థులంతా అబ్దుల్‌æకలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఆయనలా గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి పేరుప్రతిష్ఠలు తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఎవరినైనా నీ లక్ష్యం ఏమిటంటే ఇంజనీర్, డాక్టర్‌ అని చెప్పేవారని ఇప్పుడు అబ్దుల్‌కలాం అవుతామని గర్వంగా చెబుతున్నారన్నారు. అనంతరం ఇస్రోకు పంపేందుకు ఏర్పాటు చేసిన బ్యానర్‌ క్లాత్‌పై ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, విద్యార్థులు, ప్రజలు సంతకాలు చేశారు. కార్యక్రమంలో కుడుపూడి పార్థసారథి, ఎస్‌.పి.గంగిరెడ్డి, బాలాత్రిపురసుందరి, కోసూరి చండీప్రియ, టి.కె.విశ్వేశ్వరరెడ్డి, ఆదిత్య కళాశాల, రాజమహేంద్రి డిగ్రీ కళాశాల, చున్నీలాల్‌జాజు మున్సిపల్‌ హైస్కూలు, ట్రిప్స్‌ స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement