
పెళ్లిపత్రిక చూపించినా డబ్బులివ్వట్లేదు..
‘సార్.. కొడుకు పెళ్లిపెట్టుకున్నాను. బ్యాంకులో జమ చేసుకున్న డబ్బులను మంజూరు చేయడండి’
అప్పటి నుంచి బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటిదాకా కేవలం రూ.9వేలు ఇచ్చారు. పెళ్లిసమయం సమీపిస్తుండటంతో శుక్రవారం పెళ్లిపత్రికను తీసుకొని బ్యాంకు మేనేజర్‌కు చూపించి తన ఆవేదనను వెలిబుచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ అనంతయ్య కనుకరించకపోగా తమకు పైనుంచి డబ్బులు అందలేదని ఒట్టిచేతులతో తిప్పిపంపాడని హమీద్‌బాషా ఆరోపించారు. సరుకులు తీసుకొన్న వారి ఖాతా నెంబర్లు సేకరిస్తే వారికి తమ బ్యాంకు నుంచి డబ్బులను జమ చేస్తామని మేనేజర్ సలహా ఇచ్చినట్లు బాధితుడు తెలిపారు.