తనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేషన్ కౌన్సెల్‌లో మెంబర్‌షిప్ దక్కిందని జాతీయ పర్యావరణ అవార్డు గ్రహీత బత్తుల సంజీవరాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బత్తుల సంజీవరాయుడికి అంతర్జాతీయ గౌరవం
Jun 15 2017 12:49 AM | Updated on Sep 5 2017 1:37 PM
కర్నూలు (ఆర్‌యూ): తనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేషన్ కౌన్సెల్‌లో మెంబర్‌షిప్ దక్కిందని జాతీయ పర్యావరణ అవార్డు గ్రహీత బత్తుల సంజీవరాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్విడ్జర్లాండ్‌లోని జనీవా నుంచి సంస్థ చైర్ పర్సన్ ఏజే మహమ్మద్ ద్వారా తనకు మెయిల్‌లో సమాచారం అందిందన్నారు. కాగా బత్తుల సంజీవరాయుడు 30ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు, జంతు, వికలాంగుల సంక్షేమం, విద్య, ఆరోగ్య రంగాల్లో చేసిన సేవలకు పలు పురస్కారాలు అందుకున్నారు.
Advertisement


