మరుగుదొడ్డి నిర్మించలేదని విద్యార్థిని ఆత్మహత్య | Intermediate student commits suicide | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్డి నిర్మించలేదని విద్యార్థిని ఆత్మహత్య

Jan 26 2016 4:05 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించమని గత కొన్ని రోజులుగా మొరపెట్టుకుంటున్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆహుతైంది.

గుండాల (నల్లగొండ) : ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించమని గత కొన్ని రోజులుగా మొరపెట్టుకుంటున్నా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో.. మనస్తాపానికి గురైన విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆహుతైంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా గుండాల మండల కేంద్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కొడపర్తి సత్తయ్య, నాగమ్మల కూతురు కొడపర్తి రేఖ(17) స్థానిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో ఆరు బయట మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోందని గత కొన్ని రోజులుగా తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటోంది. అయినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో.. మనస్తాపానికి గురై వారు కూలి పనులకు వెళ్లిన అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసే లోపే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement