నేటి నుంచి ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు | Inter-Supplementary Exams from Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు

May 15 2017 12:04 AM | Updated on Sep 5 2017 11:09 AM

ఇంటర్మీడియట్‌ సçప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

– జిల్లాలో 80 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
 - సెంటర్ల వద్ద 144 సెక‌్షన్‌ అమలు
 
కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్‌ సçప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి   ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 23వ తేది వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో మొత్తం 80 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.  పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక‌్షన్‌ అమలులో ఉంటుంది. జిల్లాలో మొదటి సంవత్సర పరీక్షలకు 29,272 మంది, రెండో సంవత్సర పరీక్షలకు 9549 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.   సెంటర్ల సమీపంలోని జిరాక్స్‌ కేంద్రాలను మూసి వేయించాలని ఇప్పటీకే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 12 సమస్యాత్మకమైన కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. 11 కేంద్రాలకు సకాలంలో బస్సుల సౌకర్యం  కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయంలో కరెంట్‌ కట్‌ కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను కోరారు. ప్రతి కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఒకరు, డిపార్ట్‌మెంటల్‌ అధికారి ఒకరు ఉంటారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇన్విజిలేటర్లను ఆ కేంద్ర పర్యవేక్షకులు నియమించుకుంటారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement