అంతర్జాతీయ స్కేటింగ్‌ పోటీలకు ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి | Intarnationa scating meet at NRI student | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్కేటింగ్‌ పోటీలకు ఎన్‌ఆర్‌ఐ విద్యార్థి

Aug 17 2016 9:43 PM | Updated on Sep 4 2017 9:41 AM

అంతర్జాతీయ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికైన శ్రీఎన్‌ఆర్‌ఐ విద్యార్థి చంద్రగణేష్‌

అంతర్జాతీయ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికైన శ్రీఎన్‌ఆర్‌ఐ విద్యార్థి చంద్రగణేష్‌

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరగబోవు అంతర్జాతీయ స్పీడ్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు తిరుచానూరులోని శ్రీఎన్‌ఆర్‌ఐ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల 4వ తరగతి విద్యార్థి జి.చంద్రగణేష్‌ ఎంపికయ్యాడు.

తిరుచానూరు : థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరగబోవు అంతర్జాతీయ స్పీడ్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు తిరుచానూరులోని శ్రీఎన్‌ఆర్‌ఐ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల 4వ తరగతి విద్యార్థి జి.చంద్రగణేష్‌ ఎంపికయ్యాడు. బుధవారం ఆ పాఠశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి డైరెక్టర్‌ బుజ్జిరెడ్డి ఆ విద్యార్థిని అభినందించి మాట్లాడారు. గత ఏడాది నవంబర్‌లో చెన్నైలో జరిగిన 800 మీటర్ల స్కేటింగ్‌ రిలేలో బంగారు, రింగ్‌–3లో కాంస్య పతకాలు సాధించాడని పేర్కొన్నారు. అదే ఏడాది జూన్‌లో గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 3బంగారు పతకాలు, నాగ్‌పూర్‌లో జరిగిన పోటీల్లో 3బంగారు, 1వెండి, 1కాంస్య పతకం, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించాడని తెలిపారు. బ్యాంకాక్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో ఇన్‌లైన్‌ క్యాటగిరిలో పాల్గొననున్నాడని, అంతర్జాతీయ స్థాయిలోనూ పసిడి పతకాలు సాధించి దేశానికి, పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement