జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ | inmate absconded in medak district jail | Sakshi
Sakshi News home page

జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ

Oct 14 2015 11:01 AM | Updated on Oct 16 2018 3:15 PM

మెదక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న యాదగిరి అనే ఖైదీ బుధవారం పరారైయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

మెదక్ : మెదక్ జిల్లా సంగారెడ్డి జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న యాదగిరి తప్పించుకుని పరారైయ్యాడు.  పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఎప్పటిలాగే పోలీసు పహారాలో యాదగిరి జైల్లో గార్డెనింగ్ పనులు చేస్తున్నాడు. ఆ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి యాదగిరి జైలు నుంచి పరారైయ్యాడు. ఆ విషయాన్ని ఆలస్యంగా పోలీసులు గుర్తించారు.

ఇంతలో తేరుకున్న పోలీసులు అతడి కోసం గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. యాదగిరి పరారైపై జైలు సిబ్బంది.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు... జైలు సిబ్బందిపై మండిపడ్డారు. అలాగే ఈ ఘటనపై జైలు అధికారుల నుంచి ఉన్నతాధికారులు వివరణ కోరారు. 10 మంది మహిళల హత్య కేసులో యాదగిరి సంగారెడ్డి జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడని జైలు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement