‘మహా ఒప్పందం’తో తెలంగాణకు అన్యాయం
తుంగతుర్తి : మహారాష్ట్ర ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిది అద్దంకి దయాకర్ అన్నారు.
తుంగతుర్తి : మహారాష్ట్ర ఒప్పందంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిది అద్దంకి దయాకర్ అన్నారు. మండల కేంద్రంలో వర్షాభావ పరిస్థితితులతో ఎండిపోయిన వరి పొలాలను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందన్నారు. నాడు వైఎస్సార్ పాలనలో 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కట్టడానికి అనాటి మహా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారని.. ఆయన అకాల మరణంతో పాటు తెలంగాణ ఉద్యమం కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం మరుగున పడిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెడతామని బెదిరించడం ఎంత వరకు సమంజసమన్నారు. కాంతనపల్లి ప్రాజెక్టులను రద్దు చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతులకు ఈ ప్రాంత మంత్రి జగదీశ్‌రెడ్డి తీరని అన్యాయం చేశారన్నారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోతు టీక్యానాయక్, ఏశమల్ల సృజన్, కలకొట్ల మల్లేష్, మంగళపల్లి నాగరాజు, కాసర్ల ఉప్పలయ్య, మల్లెపాక కర్ణాకర్ ఉన్నారు.