భారత సంస్కృతికి ప్రపంచ ఖ్యాతి | India has a world level fame in culture | Sakshi
Sakshi News home page

భారత సంస్కృతికి ప్రపంచ ఖ్యాతి

Aug 23 2016 9:14 PM | Updated on Sep 4 2017 10:33 AM

భారత సంస్కృతికి ప్రపంచ ఖ్యాతి

భారత సంస్కృతికి ప్రపంచ ఖ్యాతి

సంప్రదాయాలను కాపాడుకోవటం మన ధర్మమని, భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయని ప్రముఖ సినీ గేయరచయిత, పేరడీ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు.

ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల
 
అమరావతి (గుంటూరు రూరల్‌) : సంప్రదాయాలను కాపాడుకోవటం మన ధర్మమని, భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయని ప్రముఖ సినీ గేయరచయిత, పేరడీ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. మంగళవారం అమరావతిలోని అమరలింగేశ్వర ఘాట్‌లో ఆయన కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా నదిలో పుష్కర స్నానం చేయటం వల్ల పుణ్యంతోపాటు ఆరోగ్యం లభిస్తుందన్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి వ్యక్తికి ఉందన్నారు. అనంతరం అమరేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement