భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని చంద్రబాబు నాయుడు అన్నారు.
విశాఖపట్నం: భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని, ఆర్థికాభివృద్ధి కూడ వేగంగా దూసుకెళ్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో బుధవారం బ్రిక్స్ దేశాల సదస్సులో చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తూ దేశాభావృద్ధికి కృషిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. పట్టణీకరణను దృష్టిలో పెట్టుకుని కేంద్రం స్వచ్ఛభారత్ను తీసుకొచ్చిందని చెప్పారు.
పట్టణాల్లో మురికివాడలను బాగు చేయడం సవాలని, పట్టణ జనాభా వేగంగా పెరుగుతోందని తెలిపారు. 2022నాటికి టాప్-3 రాష్ట్రాల్లో ఏపీ ఉండాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.