అధికార పార్టీ నేతల అండదండలతో మండలంలో బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి.
చిలమత్తూరు : అధికార పార్టీ నేతల అండదండలతో మండలంలో బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఒత్తిళ్ల కారణంగా అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గత మంగళవారం కొyì కొండ సమీపం నుంచి కర్ణాటకలోని కోలార్‌కు వెళ్తున్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ ఏసీటీఓ బేబీనందా పట్టుకుని, అందులోని 33 టన్నుల బస్తాల బియ్యాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు. కాగా లారీలను ఓపెన్ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా తూతూ మంత్రంగా రూ.2లక్షల వరకు అపరాధ రుసుం చెల్లించి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల నుంచి ఇదే రీతిలో కొత్తచెరువు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతల లారీలు వెళ్తున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు.
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే..
బియ్యం లారీలు పట్టుకున్నప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని విలేకరుల సమావేశంలో స్పెషల్ ఏసీటీఓ స్వయంగా వెల్లడించారు. దీని ఆధారంగా చూస్తే అపరాధ రుసుం తూతూమంత్రంగా చెల్లిస్తేనే వదిలేసినట్లు తెలుస్తోంది.