స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇస్తే.. బండరాయి | If the stone slab to order the smart phone .. | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్ ఆర్డర్ ఇస్తే.. బండరాయి

Jan 28 2016 1:59 AM | Updated on Oct 22 2018 5:17 PM

బండరాయిని చూపిస్తున్న బాధితురాలు - Sakshi

బండరాయిని చూపిస్తున్న బాధితురాలు

ఆన్‌లైన్ షాపింగ్‌లో తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ వస్తుందని ఎంతో ఆశపడి ఫోన్ బుక్ చేస్తే..

కాశిబుగ్గ: ఆన్‌లైన్ షాపింగ్‌లో తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ వస్తుందని ఎంతో ఆశపడి ఫోన్ బుక్ చేస్తే.. ప్యాకింగ్‌లో రాయి వచ్చింది. వరంగల్ నగరం కాశిబుగ్గ తిలక్‌రోడ్డు నివాసి కుసుమ సురభి ఈనెల 22న స్నాప్‌డీల్‌లో రూ.1,700 ధరకే మైక్రోమాక్స్ స్మార్ట్ ఫోన్ వస్తున్నట్లు చూసి ఆ ఫోన్ బుక్ చేసింది. బుధవారం కొరియర్ బాయ్ అడ్రస్ ప్రకారం ఇంటికి రావడంతో సురభి రూ.1,700 చెల్లించి ప్యాకెట్ తీసుకుంది.

తీరా కవర్ సీల్‌ తీసి చూడగా.. ప్యాకింగ్‌లో చార్జర్ వైర్‌తో పాటు బండరాయి వచ్చింది. కొరియర్ బాయ్‌ను నిలదీయగా.. తాను కేవలం కొరియర్ బయ్‌నేనని, తిరిగి కంపెనీకి సమాచారం ఇవ్వండని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు. బాధితురాలు కంపెనీకి ఫోన్ ద్వారా పలు మార్లు సమాచారం ఇచ్చినా సరైన స్పందన లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement