నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం కన్వీనర్ ఎం.సదాశివారెడ్డి, సర్పంచ్ శ్రీకళ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
చిలమత్తూరు : నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం కన్వీనర్ ఎం.సదాశివారెడ్డి, సర్పంచ్ శ్రీకళ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతం చేయడంతో పాటు, పార్టీ ఆశయాల సాధన కు చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.
మండల వ్యాప్తంగా 965 మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు కార్డులు రాగా తొలివిడతగా 750 మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రామచంద్రప్ప, నరసారెడ్డి, బాబురెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటేష్, గంగరాజు తదితరులు ఉన్నారు.