గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే | i will try to develop villages | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

Oct 3 2016 12:00 AM | Updated on Sep 4 2017 3:55 PM

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి అన్నారు.

కోదాడఅర్బన్‌: కోదాడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రాధాన్యతాక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బీక్యాతండా నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించిన సీసీరోడ్లను, గణపవరంలో ఎస్‌ఎఫ్‌సీ నిధులతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీక్యాతండాలో ఇటీవల మరణించిన కాంగ్రెస్‌ నాయకుడు ఇస్లావత్‌ పీర్యానాయక్‌ కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ డేగ రాణి,  ఎంపీటీసీలు కొండపల్లి వాసు, ఇర్ల అన్నపూర్ణ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు బానోతు అంబేద్కర్, చిట్టా వెంకట్రామమ్మ ఎంపీడీఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, సీడీపీఓ కృష్ణకుమారి, పీఆర్‌ ఏఈ లక్ష్మారెడ్డి, నాయకులు రాంరెడ్డి, సీతారాంరెడ్డి,  పలువురు అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement