భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య | Husband, wife committed persecutions | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

Feb 18 2017 12:19 AM | Updated on Sep 5 2017 3:57 AM

గాలివీడు పంచాయతీలోని ఉత్తరగడ్డ దళితవాడకు చెందిన రాంమోహన్‌ భార్య అరుణ(26) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

గాలివీడు : గాలివీడు పంచాయతీలోని ఉత్తరగడ్డ దళితవాడకు చెందిన రాంమోహన్‌ భార్య అరుణ(26) గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంమోహన్‌ మద్యం సేవించి భార్య మీద అనుమానంతో రోజూ  వేధింపులకు గురి చేసే వాడు. వేధింపులకు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు బం«ధువులు తెలుపుతున్నారు. మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అరుణ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ మంజునాథ సంఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. భర్తపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement