వజ్రాల కోసం వేట | hunt for diamonds | Sakshi
Sakshi News home page

వజ్రాల కోసం వేట

Jun 7 2017 11:14 PM | Updated on Oct 4 2018 5:34 PM

వజ్రాల కోసం వేట - Sakshi

వజ్రాల కోసం వేట

మండల కేంద్రం వజ్రకరూరు పరిసర ప్రాంతంలో వజ్రాల కోసం వేట ప్రారంభమైంది.

వజ్రకరూరు : మండల కేంద్రం వజ్రకరూరు పరిసర ప్రాంతంలో వజ్రాల కోసం వేట ప్రారంభమైంది. మంగళవారం రాత్రి వజ్రకరూరుతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ప్రతి ఏటా జూన్‌లో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా మండల వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వెదికే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా ఐదు నుంచి పది దాకా వజ్రాలు దొరుకుతున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement