గృహిణి అదృశ్యం | house wife missing in hyderabad | Sakshi
Sakshi News home page

గృహిణి అదృశ్యం

Jul 19 2015 6:38 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ లో ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

హైదరాబాద్: నగరంలో ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... వినాయక్‌నగర్‌లో నివాసముండే భవాని (19), నరేష్ భార్యాభర్తలు. భవాని ఇళ్లలో పనులు చేస్తూ ఉంటోంది. కాగా శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భవాని తిరిగి ఇంటికి రాలేదు.

 

భర్త నరేష్ వెతికినా ఆచూకి లభించకపోవడంతో ఆదివారం నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement