
చలికి వెచ్చని రుచులు
వణికించే చలికాలాన్ని వెచ్చని వంటకాలతో ఎంజాయ్ చేయమంటూ రెస్టారెంట్ మెనూస్ భోజనప్రియుల్ని ఆహ్వానిస్తున్నాయి
సాక్షి, సిటీబ్యూరో: వణికించే చలికాలాన్ని వెచ్చని వంటకాలతో ఎంజాయ్ చేయమంటూ రెస్టారెంట్ మెనూస్ భోజనప్రియుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ సీజన్ లో ప్రత్యేకంగా సీ ఫుడ్, సూప్స్ రెడీ చేసినట్టు కేఫ్ మంగిల్, ది యునైటెడ్ స్పోర్ట్స్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్స్ ప్రతినిధులు తెలిపారు. లాబ్‌స్టర్, కార్న్ చౌడర్, వింటర్ చికెన్ తో పాటు మష్రూమ్ సూప్, పంప్‌కిన్ సూప్‌లు సీజన్ స్పెషల్స్‌గా అందిస్తున్నట్టు చెఫ్‌లు డోమ్నిక్, అజయ్ చెప్పారు. వీటితో పాటు గ్రీన్ టీ æసైతం కొత్త రుచుల్ని సంతరించుకొని మెనూలో చేరిందన్నారు.