అనంతపురం అగ్రికల్చర్ : ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి ఈనెల 16న జిల్లాకు వస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో (ఎఫ్‌పీఓ) జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారన్నారు.
16న జిల్లాకు ఉద్యానశాఖ కమిషనర్
Feb 4 2017 11:59 PM | Updated on Jun 1 2018 8:39 PM
అనంతపురం అగ్రికల్చర్ : ఉద్యానశాఖ కమిషనర్ చిరంజీవిచౌదరి ఈనెల 16న జిల్లాకు వస్తున్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీఎస్ సుబ్బరాయుడు తెలిపారు. స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో (ఎఫ్‌పీఓ) జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారన్నారు. ఇందులో రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎఫ్‌పీఓ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. రైతు సంఘాల గుర్తింపు, వాటి పనితీరు, సాధించిన ఫలితాలు, బిజినెస్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణ తెలియజేస్తారని తెలిపారు.
Advertisement
Advertisement