తిరుపతిలోని తొట్టంబేడు తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
తిరుపతి: తిరుపతిలోని తొట్టంబేడు తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తమ భూములు ఇవ్వాలంటూ తొట్టంబేడు రైతులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు పురుగులమందు డబ్బాలతో మహిళా రైతులు నిరసనకు దిగారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కుంటుందంటూ రైతులందరూ ఆందోళనకు దిగారు. తమ భూములు తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.