పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద | high flow for pulichintala | Sakshi
Sakshi News home page

పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద

Sep 13 2016 9:36 PM | Updated on Sep 4 2017 1:21 PM

పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద

పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద

తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ముక్త్యాల సమీపంలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

జగ్గయ్యపేట :
 తెలంగాణలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ముక్త్యాల సమీపంలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 42 టీఎంసీలు. అయితే మంగళవారం సాయంత్రానికి 19.7 టీఎంసీల నీరు వచ్చి చేరిందని పులిచింతల డీఈ రఘనాథ్‌ తెలిపారు. ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు నీటి నిల్వను పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారమిస్తున్నట్లు చెప్పారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement