చెరువులను నింపాలని దీక్ష | hesitation for Filling water in ponds | Sakshi
Sakshi News home page

చెరువులను నింపాలని దీక్ష

Aug 28 2016 7:54 PM | Updated on Sep 17 2018 8:02 PM

చెరువులను  నింపాలని దీక్ష - Sakshi

చెరువులను నింపాలని దీక్ష

ప్రస్తుతం విడుదల చేసిన సాగర్‌ నీటితో మండలంలోని చిలుకూరు, బేతవోలు, నారాయణపురం తదితర చెరువులను తక్షణమే నింపాలని కోరుతూ శక్తి యూత్, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రామాపురం వద్ద గల ఆర్‌కే మేజర్‌ కాలువలో జలదీక్ష చేపట్టారు.

చిలుకూరు: ప్రస్తుతం విడుదల చేసిన సాగర్‌ నీటితో మండలంలోని చిలుకూరు, బేతవోలు, నారాయణపురం తదితర చెరువులను తక్షణమే నింపాలని కోరుతూ శక్తి యూత్, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రామాపురం వద్ద గల ఆర్‌కే మేజర్‌ కాలువలో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని కోరారు . ఇప్పటికే భూగర్భ జలాలు పడిపోయి మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయని అన్నారు. చెరువులను నింపకపోతే ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి యూత్‌ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్, నాయకులు అలసకాని జనార్ధన్, కొల్లు సత్యనారాయన, పట్టా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement