రైతు భరోసా దీక్షకు హాజరుకానున్న విశ్రాంత జస్టిస్‌ | Hesitation for Farmer sake | Sakshi
Sakshi News home page

రైతు భరోసా దీక్షకు హాజరుకానున్న విశ్రాంత జస్టిస్‌

Sep 22 2016 9:04 PM | Updated on Oct 1 2018 2:44 PM

రైతు భరోసా దీక్షకు హాజరుకానున్న  విశ్రాంత జస్టిస్‌ - Sakshi

రైతు భరోసా దీక్షకు హాజరుకానున్న విశ్రాంత జస్టిస్‌

రుణమాఫీ నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచెయాలని కోరుతూ కోదాడకు చెందిన సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు ఈ నెల 26న కోదాడలో చేపట్టనున్న రైతు భరోసా దీక్షలో విశ్రాంత జస్టిస్‌ చంద్రకుమార్‌ పాల్గొననున్నారు

కోదాడ: రుణమాఫీ నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచెయాలని కోరుతూ కోదాడకు చెందిన సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు  ఈ నెల 26న కోదాడలో చేపట్టనున్న రైతు భరోసా దీక్షలో విశ్రాంత జస్టిస్‌ చంద్రకుమార్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం కొల్లు వెంకటేశ్వరరావుతో పాటు  గంధం బంగారు, పొడుగు హుస్సేన్, రావెళ్ల రవికుమార్‌లో హైద్రాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి దీక్షకు ఆహ్వనించారు. దీనికి స్పందించిన చంద్రకుమార్‌ నలుగురికి అన్నం పెట్టే అన్నదాత  కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. రైతులకు మద్దతుగా జరిగే ఈ దీక్షలో  పాల్గొని వారికి మద్దతుగా నిలుస్తానని తమకు ఆయన హమీ ఇచ్చినట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement