అక్కడో మాట... ఇక్కడో మాట

అక్కడో మాట... ఇక్కడో మాట - Sakshi

  • రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం

  • కృష్ణాడెల్టా రెగ్యూలేటరీ వ్యవస్థను పరిశీలించిన అనంత రైతులు

  • అనంత జిల్లాకూ రెగ్యూలేటరీ వ్యవస్థ అవసరం

  • అఖిలపక్ష నేతలు

  • సాక్షి, విజయవాడ :  పట్టిసీమ నీరు తెచ్చి కృష్ణాడెల్టాకు పూర్తిగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాలో చెప్పడం, హద్రీ– నీవా ప్రాజెక్టు ద్వారా అనంతపురానికి నీరు ఇచ్చి ఆ జిల్లాను  సస్యశ్యామలం చేశామని కృష్ణా జిల్లాలో  ప్రగల్భాలు పలకుతున్నారని అనంతపురం జిల్లాకు చెందిన అఖిలSపక్షం నేతలు మండిపడ్డారు. కృష్ణాజిల్లాలో వాటర్‌ రెగ్యులేటరీ వ్యవస్థను,  పిల్లకాల్వల ద్వారా పొలాలకు నీళ్లు అందే విధానాన్ని పరిశీలించేందుకు అనంతపురం జిల్లాకు చెందిన అఖిలపక్ష నేత లు కృష్ణాజిల్లాకు వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హద్రీ–నీవా ప్రాజెక్టు నిర్మించేటప్పుడే పెద్దకాల్వలతో పాటు పొలాల వరకు నీరు వెళ్లేందుకు పిల్ల కాల్వలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జీవో నెం 22తో రెగ్యూలేటరీ కెనాల్స్, ఫీల్డ్‌ చానల్స్‌ నిర్మించకపోయినా అనుమతి ఇచ్చారని తెలిపారు.  దీంతో నీరంటూ వస్తే పెద్ద కాల్వలకే పరిమితం అ వుతుందన్నాన్నారు.   పులిచింతల నీరు రాకపోతే ఈఏడాది కృష్ణాడెల్టాలో వేలాది ఎకరాలు పంట పోలాలు ఎండిపోయేవని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి తెలిపారు. పట్టిసీమ ద్వారా పూర్తిస్థాయిలో నీరు ఇస్తే అవనిగడ్డ,నాగాయలంక,నియోజకవర్గాల్లో వందల ఎకరాలలో వరినాట్లు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాకు ఏపీ రైతు సంఘం నాయకులు బి.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల్ని భాగస్తుల్ని చేస్తూ రెగ్యూలేటరీ వ్యవస్థ, నీటిసంఘాలను ఏర్పాటు చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు.


    కృష్ణా జిల్లా రెగ్యూలేటరీ వ్యవస్థ భేష్‌....


    కృష్ణాజిల్లాలో కృష్ణానది నుంచి ప్రధాన కాల్వలకు, వాటి ద్వారా డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు అక్కడ నుంచి పొలాలకు నీరు పారడాన్ని చూసి అనంతపురం జిల్లా రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  సర్‌ ఆర్తర్‌ కాట¯ŒS సమయం నుంచి ఏర్పడ్డ వాటర్‌ రెగ్యూలేటరీ వ్యవస్థ, ఫీల్డ్‌ చానల్స్‌ ద్వారా  వందల ఎకరాల పొలాలకు ఒక్క యూనిట్‌ విద్యుత్‌ కూడా ఖర్చు లేకుండా నీరు అందడాన్ని చూసి ఇటువంటి వ్యవస్థ తమ జిల్లాలోనూ ఏర్పడితే బాగుంటుదని అభిప్రాయపడ్డారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top