ఐసెట్‌ కౌన్సెలింగ్‌కు పోటెత్తిన విద్యార్థులు | heavy rush of icet councelling | Sakshi
Sakshi News home page

ఐసెట్‌ కౌన్సెలింగ్‌కు పోటెత్తిన విద్యార్థులు

Jul 13 2017 10:53 PM | Updated on Nov 6 2018 5:13 PM

ఐసెట్‌ కౌన్సెలింగ్‌కు పోటెత్తిన విద్యార్థులు - Sakshi

ఐసెట్‌ కౌన్సెలింగ్‌కు పోటెత్తిన విద్యార్థులు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి ఐసెట్‌–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనకు గురువారం విద్యార్థులు పోటెత్తారు.

ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి ఐసెట్‌–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనకు గురువారం విద్యార్థులు పోటెత్తారు.  ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, అనంతపురం, ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో 721 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ కేంద్రంలో 411 మంది అభ్యర్థులు హాజరుకావడంతో గురువారం రాత్రి 10 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని క్యాంప్‌ ఆఫీసర్‌ ప్రొఫెసర్‌ బీవీ రాఘవులు తెలిపారు.  15న ఐసెట్‌ కౌన్సెలింగ్‌ పూర్తికానుంది.

Advertisement
 
Advertisement
Advertisement