ఖేడ్‌లో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

ఖేడ్‌లో భారీ వర్షం

Published Sat, Jul 30 2016 10:43 PM

వరద నీటితో మునిగిన నూతన వంతెన పిల్లర్లు

  • భారీగా వచ్చిన వరద.. మునిగిపోయిన రోడ్లు
  • స్తంభించిన రాకపోకలు
  • నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌లో శనివారం భారీ వర్షం కురిసింది. పైనుంచి కూడా వరద నీరు భారీగా వచ్చింది. దీంతో మండలంలోని రుద్రారం-పైడిపల్లి రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. నారాయణఖేడ్‌-రాయిపల్లి రూట్లో రుద్రారం, పైడిపల్లి గ్రామాల మధ్య నూతనంగా వంతెనలు నిర్మిస్తున్నారు. వాహనాలను తాత్కాలికంగా దారి మళ్లించారు. వర్షం వరద నీటితో డైవర్షన్‌ రహదారి కొట్టుకుపోయింది. నీరు భారీగా రావడంతో నూతనంగా నిర్మిస్తోన్న వంతెన పిల్లర్లుసైతం మునిగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. కొందరు నీటిలో నుంచే ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్డు దాటారు. మండలంలో వర్షపాతం 5.6మి.మీగా నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement