గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి | head constable died with heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

Nov 17 2016 12:40 PM | Updated on Sep 4 2017 8:22 PM

ఆర్‌ఫీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాజు(52) గుండెపోటుతో మృతిచెందాడు.

మట్టెవా(వరంగల్ జిల్లా): ఆర్‌ఫీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాజు(52) గుండెపోటుతో మృతిచెందాడు. మహారాష్ట్రలోని బల్లార్ష నుంచి స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం రాత్రి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. రైల్వే అధికారులు పెద్దపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా కేంద్రంలోని పెరకవాడ. రాజు మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement