సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం | hats for cm KCr potrait | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

Oct 4 2016 5:18 PM | Updated on Sep 4 2017 4:09 PM

సీఎం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిల చిత్రపటాలకు గుమ్మడిదల టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం పాలాభిషేకం చేశారు.

జిన్నారం: జిన్నారం, గుమ్మడిదల మండలాలను సంగారెడ్డి జిల్లాలో కొనసాగించేలా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిల చిత్రపటాలకు గుమ్మడిదల టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ రెండు మండలాలను సంగారెడ్డిలో కలిపేలా సీఎం నిర్ణయం తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.

కొత్తగా ఏర్పాటైన తమ మండలాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం తగిన నిధులు వెచ్చించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, నాయకులు కుమార్‌గౌడ్‌, గోవర్ధన్‌రెడ్డి, మంద భాస్కర్‌రెడ్డి, నరేందర్‌, బాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement