వడదెబ్బతో చేనేత కార్మికుడి మృతి | Handloom worker dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో చేనేత కార్మికుడి మృతి

Apr 5 2017 11:09 PM | Updated on Sep 5 2017 8:01 AM

ధర్మవరం కేశవనగర్‌లో వై.ఓబుళరెడ్డి(28) అనే చేనేత కార్మికుడు వడదెబ్బతో బుధవారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ధర్మవరం అర్బన్ : ధర్మవరం కేశవనగర్‌లో వై.ఓబుళరెడ్డి(28) అనే చేనేత కార్మికుడు వడదెబ్బతో బుధవారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం నుంచి మగ్గం పనిలో నిమగ్నమై ఉన్న ఓబుళరెడ్డి సాయంత్రానికల్లా వడదెబ్బకు గురయ్యాడన్నారు.  వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. వడదెబ్బతోనే అతను మృతి చెందినట్లు డాక్టర్‌ లక్ష్మీరాంనాయక్‌ నిర్ధరించారు. మృతునికి భార్య రమాదేవి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement