అదృష్టం.. హజ్‌యాత్ర భాగ్యం | haj tour.. lucky | Sakshi
Sakshi News home page

అదృష్టం.. హజ్‌యాత్ర భాగ్యం

Aug 14 2016 11:11 PM | Updated on Sep 4 2017 9:17 AM

అదృష్టం.. హజ్‌యాత్ర భాగ్యం

అదృష్టం.. హజ్‌యాత్ర భాగ్యం

మహ్మద్‌ ప్రవక్త పుట్టి పెరిగిన ప్రాంతాన్ని సందర్శించే భాగ్యం కలగడం హజ్‌ యాత్రికుల అదష్టమని రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ మోమిన్‌ అహ్మద్‌ హుసేన్‌ అన్నారు.

– యాత్రికులకు అన్ని సదుపాయాలు
– అదనపు కోటా వస్తే మరో 2వేల మందికి అవకాశం
– రాష్ట్ర కమిటీ చైర్మన్‌ మోమిన్‌ అహ్మద్‌ హుసేన్‌ 
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ):
మహ్మద్‌ ప్రవక్త పుట్టి పెరిగిన ప్రాంతాన్ని సందర్శించే భాగ్యం కలగడం హజ్‌ యాత్రికుల అదష్టమని రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ మోమిన్‌ అహ్మద్‌ హుసేన్‌ అన్నారు. హజ్‌ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు. స్థానిక ఈడెన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో రాయలసీమ హజ్‌ సొసైటీ, జిల్లా హజ్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో హజ్‌ యాత్రికులకు ఉచిత వ్యాక్సినేషన్‌ శిబిరం నిర్వహించారు.  ఆయనతో పాటు ప్రముఖ ముస్లిం నాయకుడు తాటిపాడు మాబ్బాషా ముఖ్యSఅతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర వి¿¶ జన తర్వాత  ఏపీ ప్రభుత్వం విజయవాడ, కడప జిల్లాలో హజ్‌ హౌస్‌ల నిర్మాణం చేపడుతోందన్నారు. హజ్‌ యాత్రికుల మొదటి ఫై ్లట్‌ ఈ నెల 25 లేక 26వ తేదీన బయలుదేరుతుందన్నారు. ప్రభుత్వం అదనపు కోటా మంజూరు చేస్తే వెయిటింగ్‌ లిస్టులో ఉన్న మరో 2వేల మందికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాయలసీమ హజ్‌ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్‌ రహ్మాన్‌ ఖాన్, ఎం.మొహ్మద్‌ పాషా, జిల్లా సొసైటీ అధ్యక్షుడు నూర్‌ అహ్మద్‌ ఖాన్, సొసైటీ సభ్యుడు ఉస్మాన్, నోబుల్‌ సర్వీసెస్‌ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్‌ రజాక్, ముఫ్తి అబ్దుర్రహ్మాన్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
 
70 ఏళ్లకు పైబడ్డ యాత్రికులకు అందని వ్యాక్సిన్‌
ఆదివారం ఈడెన్‌ గార్డెన్‌లో నిర్వహించిన శిబిరంలో 70 ఏళ్లకు లోపున్న హజ్‌ యాత్రికులకు మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఆ పైన వయసు వారికి ప్రత్యేక వ్యాక్సిన్‌ అవసరమవుతుంది. ఆ కోవకు చెందిన వ్యాక్సిన్‌ సరఫరా లేకపోవడంతో వారంతా వెనుదిరిగారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement