అంగరంగవైభవంగా బోనాల వేడుకలు | grand celebrations of bonalu in hyderabad | Sakshi
Sakshi News home page

అంగరంగవైభవంగా బోనాల వేడుకలు

Jul 31 2016 4:46 PM | Updated on Oct 2 2018 3:40 PM

బోనాల వేడుకలు వాడవాడలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

బోనాల వేడుకలు వాడవాడలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాల్లో బోనాలు ఎత్తుకొని మహిళలు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. వైభవోపేతంగాజరిగిన బోనాల వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తోన్నారు..

 

ఫిలింనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఖైరతాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డి, ఎన్బీటీ నగర్‌లోని ఎల్లమ్మ దేవాలయంలో బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి, పంజగుట్ట ప్రతాప్‌నగర్‌లో వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని వెంకటేశ్వరనగర్ బస్తీలోని శ్రీ పోచమ్మ దేవాలయంలో మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బి. భారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఊరేగింపుల్లో పోతరాజులు సందడి చేశారు. నృత్యాలతో యువకులు ఆకట్టుకుంటున్నారు. ఎటు చూసినా బోనాల సందడి కనువిందు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement