వైభవంగా చేనేత దినోత్సవం
సిరిసిల్లలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. స్థానిక నేతన్నచౌక్‌లోని చేనేత కార్మికుడి కాంస్య విగ్రహానికి పద్మశాలీసంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు నేతన్న విగ్రహానికి పూలమాలవేసి జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు.
-
నేతకార్మికులకు సన్మానం
-
నేతన్న విగ్రహానికి క్షీరాభిషేకం
సిరిసిల్ల: సిరిసిల్లలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. స్థానిక నేతన్నచౌక్‌లోని చేనేత కార్మికుడి కాంస్య విగ్రహానికి పద్మశాలీసంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు నేతన్న విగ్రహానికి పూలమాలవేసి జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత శిల్పి నల్ల విజయ్‌కుమార్‌తోపాటు మరో నలుగురు నేత కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, ఏఎంసీ చైర్మన్ జిందం చక్రపాణి, ‘సెస్’ వైస్‌చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పులి విఠల్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సిరిసిల్లలో కాంగ్రెస్‌పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలోనూ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. నేతన్న విగ్రహానికి పూలమాలవేసి నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం విఠల్, గోనె ఎల్లప్ప పాల్గొన్నారు.