విషజ్వరాలను పట్టించుకోని సర్కార్‌ | governametn failer in health service | Sakshi
Sakshi News home page

విషజ్వరాలను పట్టించుకోని సర్కార్‌

Aug 11 2016 7:24 PM | Updated on Sep 4 2017 8:52 AM

విషజ్వరాలను పట్టించుకోని సర్కార్‌

విషజ్వరాలను పట్టించుకోని సర్కార్‌

మంథని డివిజన్‌లో విషజ్వరాలతో ప్రజలు మృతి చెందుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైందని టీపీసీసీ ఉపాద్యక్షుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాళేశ్వరంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. విషజ్వరాలబారిన పడిన నిరుపేదలకు ఆరోగ్యశ్రీకార్డు కింద వైద్యసేవలందించాలన్నారు.

  • ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్యసేవలందించాలి
  • మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
  • మాజీ మంత్రి శ్రీధర్‌బాబు
  • కాళేశ్వరం: మంథని డివిజన్‌లో విషజ్వరాలతో ప్రజలు మృతి చెందుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైందని టీపీసీసీ ఉపాద్యక్షుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాళేశ్వరంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. విషజ్వరాలబారిన పడిన నిరుపేదలకు ఆరోగ్యశ్రీకార్డు కింద వైద్యసేవలందించాలన్నారు. బెగులూర్‌ గ్రామంలో విషజ్వరాలతో ఐదుగురు మృతి చెందినా ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి చలనం లేదన్నారు. మహదేవపూర్‌ మండలంలో విషజ్వరాలతో 12మంది వరకు మృతిచెందినట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా మంత్రులు, కలెక్టర్‌ పట్టించుకోకపోవడం బాధాకర మన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను నియమించి ప్రాథమిక చికిత్స అందించాలని  డిమాండ్‌ చేశారు. విషజ్వరాలు ప్రబలుతున్న గ్రామాల్లో ప్రభుత్వం వైద్య బృందాలను ఏర్పాటుచేసి వ్యాధులు నయమయ్యేవరకు పర్యవేక్షించాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. సమావేశంలో మహదేవపూర్‌ సర్పంచ్‌ కోటరాజబాబు,  కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జవ్వాజీ తిరుపతి, యూత్‌ కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడు విలాస్‌రావు, కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు తిరుపతిరెడ్డి,సమ్మయ్య పాల్గొన్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement