breaking news
d.sridharbabu
-
మంథనిని పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలి
మంథని అసెంబ్లీని విభజించి ఇతర జిల్లాలకు కలపడం తగదు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కరీంనగర్ : మంథని పట్టణ కేంద్రంగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరిట జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్‌బాబు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్‌కు గురువారం లేఖ రాశారు. మంథని అసెంబ్లీ నియోజక వర్గాన్ని రెండుగా విభజించి ఇతర జిల్లాలో కలపాలనే ఆలోచన సరికాదని అన్నారు. విశాలమైన మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం ప్రాంతం ప్రస్తుత జిల్లాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉందని, ప్రకృతివనరులు, బొగ్గు, నీరు, అటవీ ప్రాంతం, ఆధునిక వ్యవసాయం, విద్యు^è ్ఛక్తి లాంటివి అందుబాటులో ఉన్నాయన్నారు. మంథని పట్టణం ఆధ్యాత్మికతకు నిలయమని పేర్కొన్నారు. చాలా రోజులుగా మంథని జిల్లా కోసం విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ అమలు నోచుకోలేకపోయిందని అన్నారు. మంథని పట్టణంలో బస్సుడిపో, జేఎన్టీయూ, ఇంజినీరింగ్ కళాశాల, సబ్కోర్టుతో పాటు తదితర కార్యాలయాలు 30 సంవత్సరాల క్రితమే రెవెన్యూ డివిజన్ ఉందని గుర్తు చే శారు. ముత్తారం మండలం లద్నాపూర్, మల్హర్ మండలం తాడిచెర్ల ప్రాంతంలో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వివరించారు. తెలంగాణలోని ప్రస్తుత జిల్లాలకు సాగునీరందించే మేడిగడ్డ ప్రాజెక్టుతోపాటు, దక్షిణకాశీగా పేరొందిన కాళేశ్వరం దేవస్థానం, తెలంగాణకు సాగునీరు, తాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు, అటవీ సంపద, సిమెంట్ కర్మాగారాలు, బొగ్గు వనరులు కలిగి ఉండి భవిష్యత్తులో ఏర్పడే 27 జిల్లాల్లో కూడా మంథని తలమానికంగా ఉంటుందని తెలిపారు. మంథని పట్టణాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును పెట్టాలని, మంథని అసెంబ్లీ నియోజక వర్గాన్ని రెండుగా విభజించి ఇతర జిల్లాల్లో కలపాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని లేఖలో వివరించారు. -
విషజ్వరాలను పట్టించుకోని సర్కార్
ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్యసేవలందించాలి మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి మాజీ మంత్రి శ్రీధర్‌బాబు కాళేశ్వరం: మంథని డివిజన్లో విషజ్వరాలతో ప్రజలు మృతి చెందుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో విఫలమైందని టీపీసీసీ ఉపాద్యక్షుడు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాళేశ్వరంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. విషజ్వరాలబారిన పడిన నిరుపేదలకు ఆరోగ్యశ్రీకార్డు కింద వైద్యసేవలందించాలన్నారు. బెగులూర్ గ్రామంలో విషజ్వరాలతో ఐదుగురు మృతి చెందినా ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి చలనం లేదన్నారు. మహదేవపూర్ మండలంలో విషజ్వరాలతో 12మంది వరకు మృతిచెందినట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా మంత్రులు, కలెక్టర్ పట్టించుకోకపోవడం బాధాకర మన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను నియమించి ప్రాథమిక చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. విషజ్వరాలు ప్రబలుతున్న గ్రామాల్లో ప్రభుత్వం వైద్య బృందాలను ఏర్పాటుచేసి వ్యాధులు నయమయ్యేవరకు పర్యవేక్షించాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. సమావేశంలో మహదేవపూర్ సర్పంచ్ కోటరాజబాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవ్వాజీ తిరుపతి, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు విలాస్‌రావు, కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు తిరుపతిరెడ్డి,సమ్మయ్య పాల్గొన్నారు.