కొవ్వూరు: కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ఏటిగట్టుపై ఉన్న అన్నపూర్ణ, విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి పంచాయతన శివాలయంలో సోమవారం ప్రత్యేక మంచులింగం ఏర్పాటు చేయనున్నట్టు ఆలయ నిర్వాహకులు మల్లిన సత్యనారాయణ తెలిపారు.
గోష్పాద క్షేత్రంలో జ్వాలాతోరణం
Nov 13 2016 12:30 AM | Updated on Sep 4 2017 7:55 PM
కొవ్వూరు: కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ఏటిగట్టుపై ఉన్న అన్నపూర్ణ, విశాలాక్షి సమేత కాశీవిశ్వేశ్వరస్వామి పంచాయతన శివాలయంలో సోమవారం ప్రత్యేక మంచులింగం ఏర్పాటు చేయనున్నట్టు ఆలయ నిర్వాహకులు మల్లిన సత్యనారాయణ తెలిపారు. సాయంత్రం 5 నుంచి భక్తుల దర్శనం కోసం అందుబాటులో ఉంచుతామన్నారు. గోదావరికి నీరాజనం, జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం స్వామి వారికి ఊరేగింపు ఉంటుంది. గోష్పాదlక్షేత్రంలోని సుందరేశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం జ్వాలాతోరణం నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు మానేపల్లి శ్రీనివాసమూర్తి తెలిపారు. ఆలయంలో స్వామి వారికి విశేష పూజలతో పాటు పల్లకీ సేవ నిర్వహిస్తామని సత్యనారాయణ చెప్పారు.
Advertisement


