బంగారు నగలు చోరీ | gold ornaments theft | Sakshi
Sakshi News home page

బంగారు నగలు చోరీ

Dec 30 2016 12:38 AM | Updated on Sep 4 2017 11:54 PM

సిద్దవటం మండలం ఉప్పరపల్లె పంచాయతీలోని సాయినగర్‌ రోడ్‌ నెంబర్‌3లో నివాసముంటున్న అవ్వారు రామ్మూర్తి తన నివాసంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నగలను దొంగలించారని తెలిపారు. రామ్మూర్తి కుమారుడు వెంకటసుబ్బయ్య కడపలోని ఓ డెంటల్‌ ఆసుపత్రిలో పని చేస్తూ కడపలోనే కాపురముంటున్నారు.


సిద్దవటం :  సిద్దవటం మండలం ఉప్పరపల్లె పంచాయతీలోని సాయినగర్‌ రోడ్‌ నెంబర్‌3లో నివాసముంటున్న అవ్వారు రామ్మూర్తి  తన నివాసంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు నగలను దొంగలించారని తెలిపారు. రామ్మూర్తి కుమారుడు వెంకటసుబ్బయ్య కడపలోని ఓ డెంటల్‌ ఆసుపత్రిలో పని చేస్తూ కడపలోనే కాపురముంటున్నారు. ఆయనకు బుధవారం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటికి తాళాలు వేసి కడపకు వెళ్లారు. బుధవారం రాత్రి తమ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేశారని స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే గ్రామానికి  వచ్చి ఇంట్లోని బీరువాను పరిశీలించారు. అందులో ఉన్న బంగారు ఆభరణాలు , నల్ల పూసల దండ, గుండ్ల దండ, 8 గాజులు, ఒక జత కమ్మలు, చైన్, ఉంగరం చోరీకి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ. 2.80 లక్షలు ఉంటుందని గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement